Rain Alert : రెండు రోజులు దంచికొట్టనున్న వర్షాలు | Weather Report | Heavy Rains in Telugu States-TV9

Rain Alert : రెండు రోజులు దంచికొట్టనున్న వర్షాలు | Weather Report | Heavy Rains in Telugu States-TV9

మండు వేసవిలో జోరువాన కురిసింది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వానలు దంచికొట్టాయి. వర్షాకాలాన్ని తలపించాయి. హైదరాబాద్‌లో రహదారులు జలమయమయ్యాయి. తెలంగాణలో కొన్నిచోట్ల పంటనష్టం జరిగింది. రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల పిడుగుల పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొమురం భీం జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్ మండల్లాల్లో భారీ వర్షం భయపెట్టింది. ఉరుములు, మెరుపులతో అకస్మాత్తుగా విరుచుకుపడ్డ వర్షం.. రైతులను ఆగమాగం చేసింది. అకాల వర్షాలతో మొక్కజొన్నలు, వరి తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో రెండు గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. నాగర్‌కర్నూలు జిల్లా కోడోనిపల్లిలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పిడుగుపాటుకు మొత్తం నలుగురు మృతి చెందారు. యాదాద్రి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసింది. లోయర్‌ ట్యాంక్‌బండ్‌, చార్మినార్‌,ఉప్పల్‌, ఎంజీబీఎస్‌, సెక్రటేరియట్‌, NTR గార్డెన్స్‌తోపాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ జోరు వాన పడింది. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, చార్మినార్‌లో రోడ్లు జలమయం అయ్యాయి. ఎర్రమంజిల్‌లో కారుపై భారీ వృక్షం పడింది. మలక్‌పేటలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఓ కారు, ఆర్టీసీ బస్సు వాన నీటిలో చిక్కుకుపోవడంతో వాటిని ఒడ్డుకు చేర్చేందుకు ట్రాఫిక్‌ పోలీసులు, స్థానికులు అవస్థలు పడ్డారు. హిమాయత్‌నగర్‌లో 9.1 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 9, సరూర్‌నగర్‌లో 8.9, నాంపల్లిలో 8.8, ముషీరాబాద్‌లో 8.7, అంబర్‌పేటలో 8.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. Rain Alert : రెండు రోజులు దంచికొట్టనున్న వర్షాలు | Weather Report | Heavy Rains in Telugu States-TV9 ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #weatherupdate #heavyrain #telangana #andhrapradesh #rainalert Credits : Rajeswari / Producer #tv9d