Birth Certificate లేకపోతే? | Late Birth Process ఎలా? | Full Guide in Telugu 2025

Birth Certificate లేకపోతే? | Late Birth Process ఎలా? | Full Guide in Telugu 2025

Application Form Link : https://shorturl.at/hAsl8 "హాయ్ అందరికి నమస్తే. బర్త్ సర్టిఫికేట్ ప్రయోజనాలు బర్త్ సర్టిఫికేట్ ఎందుకు అవసరం అవుతుంది? • రైస్ కార్డులో వక్తిని జోడించేందుకు • స్కూల్ లేదా కాలేజీ అడ్మిషన్ కోసం • నవోదయ & రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్మిషన్ పరీక్షలకు • ఆధార్ కార్డ్‌లో DOB మార్పులు / పేరు మార్పులకు • ఇంకా చాలా ప్రభుత్వ పథకాలకి ఇది అవసరమవుతుంది కావాల్సిన డాక్యుమెంట్లు బర్త్ సర్టిఫికేట్ కోసం అవసరమయ్యే జిరాక్స్‌లు: • అప్లికేషన్ ఫారమ్ (లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది) • డెలివరీ సర్టిఫికేట్ ( ఈ డెలివరీ సర్టిఫికేట్ పుట్టిన హాస్పిటల్‌ ఇస్తారు.) • తల్లి, తండ్రి ఆధార్ కార్డు జిరాక్స్‌లు ________________________________________ ఎక్కడ అప్లై చేయాలి • గ్రామ సచివాలయం • లేదా మున్సిపల్ ఆఫీస్‌లో మీరు అప్లై చేయవచ్చు గమనిక: ఇది పుట్టిన 45 రోజుల లోపు అప్లై చేయాలనుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. లేట్ బర్త్ సర్టిఫికేట్ ప్రాసెస్ Step by Step Process: 1. మీరు పుట్టిన ప్రదేశంలోని గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ ఆఫీస్‌కి వెళ్లి 👉 Non-Availability Certificate తీసుకోవాలి 2. దగ్గరలోని లాయర్ దగ్గర నోటరీ లేదా లాయర్ అఫిడవిట్ చేయించాలి 3. ఇప్పుడు మీసేవ లేదా గ్రామ సచివాలయంకి వెళ్లి 👉 లేట్ బర్త్ సర్టిఫికేట్ కి అప్లై చేయాలి 4. పైన చెప్పిన మూడు డాక్యుమెంట్లు తీసుకుని MRO ఆఫీస్‌లో ఇవ్వాలి 5. అక్కడి నుంచి ఫైల్ RDO ఆఫీస్‌కి proceeding కోసం పంపబడుతుంది – ఆపై 45 రోజుల్లో ప్రొసిడింగ్స్ వస్తాయి 6. ఈ ప్రొసిడింగ్స్ తీసుకుని మీ గ్రామ సచివాలయం లేదా మీ సేవా కేంద్రంకి వెలితే అక్కడ మీకు ‘బర్త్ సర్టిఫికేట్’ ఇస్తారు. ________________________________________ సర్టిఫికేట్‌లో మార్పులు • పేరులో తప్పు ఉన్నా.. • DOB తప్పు ఉన్నా.. • లేదా పూర్తిగా సర్టిఫికేట్ పోయినా.. మీరు సర్టిఫికేట్ తీసుకున్న ఆఫీసులో లాయర్ నోటరీ లేదా అఫిడవిట్ ఇచ్చి, తిరిగి కొత్త బర్త్ సర్టిఫికేట్ పొందవచ్చు. ________________________________________ ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఇప్పటికే చాలా రకాల గవర్నమెంట్ సర్టిఫికేట్స్ గురించి వీడియోలు ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూడండి... ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.