ఎగ్ లాబాబ్దర్ | Egg lababdar #eggrecipes #eggcurry #food #cooking #egg #anda #andacurry

ఎగ్ లాబాబ్దర్ | Egg lababdar #eggrecipes #eggcurry #food #cooking #egg #anda #andacurry

ఎగ్ లాబాబ్దర్ | Egg lababdar | Egg Recipes | Anda Lababdar Egg Curry Recipe | SIde dish for Chapathi | ‪@HomeCookingTelugu‬ #egglababdar #andalababdar #eggrecipes #andarecipes #eggcurryrecipe #homecookingtelugu #hemasubramanian కావలసిన పదార్థాలు: టొమాటోలు - 4 జీడిపప్పులు (నానపెట్టిన) - 20 నూనె - 4 టేబుల్స్పూన్లు మసాలా దినుసులు (బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు) జీలకర్ర - 1 టీస్పూన్ ఉల్లిపాయలు - 2 అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్ పసుపు - 1 / 4 టీస్పూన్ కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు జీలకర్ర పొడి - 1 టీస్పూన్ ధనియాల పొడి - 2 టీస్పూన్లు ఉప్పు - 1 టీస్పూన్ నీళ్ళు - 1 కప్పు పచ్చిమిరపకాయలు - 4 గరం మసాలా పొడి - 1 టీస్పూన్ పంచదార - 1 టీస్పూన్ కసూరీ మేథీ కొత్తిమీర గుడ్లు - 6 కార్డ్స్ : 5 నిముషాలు మగ్గనివ్వాలి 10 నిముషాలు ఉడకనివ్వాలి తయారీ విధానం : ఎగ్ లాబాబ్దర్ కోసం మనం ముందుగా నాలుగు టొమాటోలు ముక్కలు , ఇరవై నానపెట్టిన జీడిపప్పులు మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్టులా మిక్సీ పట్టుకోవాలి . తరువాత ఒక వెడల్పాటి కడై పెట్టుకొని అందులో నాలుగు టేబుల్స్పూన్లు నూనె , మసాలా దినుసులు ( బిర్యానీ ఆకు , దాల్చిన చెక్కా , రెండు యాలకులు , నాలుగు లవంగాలు ) , ఒక టీస్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. తరువాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరుకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఒక టీస్పూన్ అల్లం వెల్లులి పేస్టు వేసి కలుపుకొని , ముందుగా చేసి పెటుకున్న టమాటో జీడిపప్పు గుజ్జు వేసి కలుపుకోవాలి. టమాటో జీడిపప్పు గుజ్జు తీసిన తరువాత మిక్సీ లో కాస్త నీళ్ళు పోసి కడిగి ఆ నీళ్ళు కూడా వేసుకోవాలి. మసాలా కాస్త దగిర పడి పచ్చి వాసన పోయిన తరువాత , పావు టీస్పూన్ పసుపు , రెండు టీస్పూన్లు కాశ్మీరీ కారం , ఒక టీస్పూన్ జీలకర్ర పొడి , రెండు టీస్పూన్లు ధనియాల పొడి , ఒక టీస్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి . తరువాత ఒక కప్పు నీళ్ళు పోసుకొని , నాలుగు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు , ఒక టీస్పూన్ గరం మసాలా , ఒక టీస్పూన్ పంచదార వేసి కలుపుకొని మూత పేటి ఐదు నిముషాలు మగ్గనివ్వాలి. ఐదు నిముషాలు తరువాత మూత తీసి కొద్దిగా కసూరి మేతి , తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి . తరువాత బిర్యానీ ఆకు తీసేసి , కోడిగుడ్డులు డైరెక్టుగా కూర లో ఒకక దానికి కాస్త కాలి ఉంచి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి పైన కాస్త కొత్తిమీర జల్లి మూత పేటి పది నిముషాలు ఉడకనివ్వాలి. పది నిముషాలు తరువాత ఎంతో టేస్టీ ఐనా ఎగ్ లాబాబ్దర్ రెడీ . Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com