#hosannagorantla #hosannaministriesofficial #hosannaministriessongs #hosanna #4k #hosannaministries #christiansongs #gospelsongs ఊహకందని ప్రేమలోని బావమే నీవు హృదయమందు పరవసించు గానమే నీవు మనస్సు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మరపురాని కలల సౌధం గురుతులే నీవు ఎడబాయలేనన్న నిజస్నేహమే నీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు తల్లడిల్లె తల్లికన్న మించి ప్రేమించి తనువుతీరే వరకు నన్ను విడువలేనంది అదియే... నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చినప్రేమగా నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయె నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయె నింగి నేలను కలిపిన బలమైన వారధిగా నేలకొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా అదియే... తన మహిమ విడినత్యాగము ఈ భువికి వచ్చిన భాగ్యము నను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే నీ సర్వమిచ్చిన దాతవు నను హత్తుకున్న స్వామివి దేహమందు గాయమైతే కుదుటపడును కదా గుండెగాయము గురుతుపట్టిన నరుడులేడు కదా నీవే నీవే యేసయ్యా... నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు నను భుజముపైన మోసిన అలసిపోనీ ప్రేమవు నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటు లేనే లేదయ